SAKSHITHA NEWS

అట్టడుగు వర్గాలకు అండగా ఉంటా — కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ తన నివాసం వద్ద రోజువారి కార్యాచరణలో భాగంగా నియోజకవర్గం ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు..

అనంతరం పలు ఆహ్వానాలు,వినతి పత్రాలను స్వీకరించి సానుకూలంగా స్పందించారు..

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ..

— నియోజకవర్గం ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు..

— మన కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటుందన్నారు..

— నియోజకవర్గం అభివృద్దే నా ఆకాంక్ష అన్నారు..

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు, సంక్షేమ సంఘాల నాయకులు, యువజన నాయకులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు తదితరులు పాల్గొన్నారు..