
కార్యనిర్వాహణాధికారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలుగు విశ్వవిద్యాలయం శ్రీశైల ప్రాంగణ సిబ్బంది
సాక్షిత రాజు శ్రీశైలం
చరిత్ర సంస్కృతి, పురావస్తు శాస్త్ర పీఠం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, శ్రీశైలప్రాంగణం పీఠాధిపతి డాక్టర్. ఎం, శ్రీనివాసరావు మరియు బోధన, బోధనేతర సిబ్బంది శ్రీశైలదేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎమ్.శ్రీనివాసరావు ని మర్యాదపూర్వకంగా కలసి వారికి విశ్వవిద్యాలయం 2025 సంవత్సర కాలెండర్లను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్యనిర్వహణ అధికారి వారు శ్రీశైల ప్రాంగణంలో అమలులో ఉన్న కోర్సులు, గ్రంధాలయం మరియు విశ్వవిద్యాలయం పక్షాన శ్రీశైలమహాక్షేత్రంపై జరిగిన పరిశోధనలు, నిర్వహించిన సెమినార్లు, విశ్వవిద్యాలయ ఆచార్యులు, అధ్యాపకులచే వెలువడిన పరిశోధనా గ్రంధాలు మొదలైనవాటి గురించి ఆసక్తికరంగా అడిగి తెలుసుకున్నారు. అంతేకాక క్షేత్ర దర్శనానికి వచ్చే యాత్రీక, భక్త సందర్శకులందరికి దేవాలయపరమైన నిర్మాణ విశేషాలు, ఆధ్యాత్మిక సమాచారం తెలుపడానికి “గైడ్” లను ఏర్పాటు చేయడం గురించి కూడా చర్చించారు. (డా.ఎమ్.శ్రీనివాసరావు పీఠాధిపతి, డా.డి.విశ్వనాధశాస్త్రి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డా.పి.మురళీధర రెడ్డి. మ్యూజియం కన్సర్వేటర్, సి.రమేశ్ బాబు జూనియర్ అసిస్టెంట్, కె.బాబు వర్క్ ఇన్ స్పెక్టర్ మొదలైనవారు విశ్వవిద్యాలయం పక్షాన ఈ.ఓ ని కలిశారు.)

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app