నిజాంపేట్ శ్రీ నల్ల పోచమ్మ ఆలయంలో శ్రీ శ్యక్తానంద గిరి స్వామి వారి ఆధ్వర్యంలో ఘనంగా దుర్గాదేవి అలంకరణ కుమారి దేవి పూజ కార్యక్రమం…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ లోని శ్రీ నల్ల పోచమ్మ ఆలయంలో ఐశ్వర్యంబిక తపోవనం త్రిశక్తి పీఠం పూజ్య గురుదేవులు శ్రీ శ్రీ శ్యక్తానంద గిరి స్వామి వారి ఆధ్వర్యంలో దేవీ శరన్నవరాత్రుల పూజల్లో భాగంగా ఈరోజు దుర్గా దేవి మరియు కుమారి దేవి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దుర్గాదేవి రూపంలో బాలికను అద్భుతంగా అలకరించి అమ్మవారిని పూజించారు. అనంతరం అమ్మవారి కుంకుమార్చన, దశ మహా విద్యలు హోమం, వస్త్ర పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.