భౌరంపేట్ ప్రాంతంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం

Sakshitha news

వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు… భక్తి శ్రద్ధలతో ఘనంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం.
….

సాక్షిత : ధర్మ రక్షకుడు, ఏక వాక్య పాలకుడు అయిన శ్రీరాముని శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ సర్కిల్‌లోని భౌరంపేట్ ప్రాంతంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించారు.

ఈ కార్యక్రమానికి దుండిగల్ మున్సిపల్ మాజీ చైర్మన్ శంభిపూర్ కృష్ణవేణి-కృష్ణ , భౌరంపేట్ మాజీ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం భౌరంపేట్ ఇందిరమ్మ కాలనీతో పాటు వివిధ కమ్యూనిటీ కాలనీలలో నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలకు హాజరై పూజల్లో పాల్గొన్నారు.

భౌరంపేట్ ఇందిరమ్మ కాలనీలో భక్తులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మాజీ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శ్రీరాముని ఆచరణ, ధర్మం, నిజాయితీ ప్రతి ఒక్కరికీ ఆదర్శమని తెలిపారు. సమాజంలో ధర్మం నిలవాలంటే శ్రీరాముని మార్గాన్ని అనుసరించాలన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు, యువకులు, మహిళలు మరియు ఆలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top