మా ఎమ్మెల్యే పై తప్పుడు ప్రచారాలు సమంజసం కాదు

Sakshitha news

మా ఎమ్మెల్యే పై తప్పుడు ప్రచారాలు సమంజసం కాదు

…..
సాక్షిత : అభివృద్ధిపై బురద చల్లటం వైసిపికి అలవాటు.

గత ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం అన్ని అక్రమాలే

అన్ని న్యాయబద్ధంగానే స్టవ్ బిడి కాలనీలో ఇళ్లు తొలగింపు

కోవూరు టిడిపి నాయకులు

నెల్లూరు జిల్లా అభివృద్ధిని అడ్డుకోవడం బురద చల్లడం వైసీపీకి అలవాటేనని అందులో భాగంగా కోవూరు స్టవ్ బిడి కాలనీ ఇళ్లు తొలగింపులో రాద్ధాంతం చేస్తున్నారని టిడిపి నాయకులు అన్నారు. పివిఆర్ కళ్యాణ మండపంలో టిడిపి నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానికులు వైసిపి నాయకుల ప్రలోభాలకు లోనై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి ఇప్పటికే ఇళ్ల స్థలాలు మంజూరు చేసి, నిర్మాణాలు పూర్తి చేసి, బిల్లులు కూడా పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని.

ఈ ప్రాంతంలో విద్యుత్ శాఖ భవనం నిర్మాణం కొరకు మూడు, నాలుగు నెలలు ముందే వారికి సమాచారం ఇచ్చామని ఆ తరువాత వారు స్వచ్ఛందంగానే ప్రాంతాన్ని ఖాళీ చేసినట్లు చెప్పారు.అనంతరం ఆ ప్రదేశాన్ని జెసిబి సహాయంతో చదును చేయడానికి మాత్రమే చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు.వైసిపి నాయకులపై తీవ్ర విమర్శలు చేసిన టిడిపి నాయకులు,గత ప్రభుత్వ కాలంలో వైసిపి నాయకులు అనేక స్థలాలను అక్రమంగా కబ్జా చేసి విక్రయించారని ఆరోపించారు.

ఇళ్లు తొలగింపు ప్రక్రియ చట్టబద్ధంగానే జరిగిందని, స్థానికులు స్వచ్ఛందంగానే ముందుగా ఖాళీ చేశారని తెలిపారు. మా ఎమ్మెల్యే ప్రశాంతమ్మ అభివృద్ధిని చూసి ఓర్వలేక చేస్తున్న తప్పుడు ప్రచారమని తెలిపారు.ఇలాంటి ఘటనలు పునరావృతం చేస్తే వైసీపీ నాయకుల చిట్టాలు తీస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కోవూరు మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, పెన్నా డెల్టా చైర్మన్ రాజగోపాల్ రెడ్డి,ఇంతా మల్లారెడ్డి,తిరుమూరు అశోక్ రెడ్డి, జెట్టి మదన్ రెడ్డి, తాటిపర్తి విజయ్ కుమార్ రెడ్డి, బాల రవి, సాయి తేజ రెడ్డి, బత్తల రమేష్, తిరుపతి కొండారెడ్డి, గాదిరాజు అశోక్, బెల్లంకొండ విజయ్,దారవిజయ్ బాబు, ముసలిసుధాకర్,పి. బాలకృష్ణ షేక్. జహంగీర్ ,షేక్. జమీర్, షేక్. నాసీర్,యస్.డి దత్తగిరి, కార్యకర్తలు మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top