సాక్షిత : హనుమకొండ ఎక్సైజ్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ రామనవమి సందర్భంగా ఘనంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ-వరదరాజేశ్వర్ రావు దంపతులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ ఆర్చకులు నిర్వహించిన వేద మంత్రోచ్ఛారణల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా కొనసాగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న ఎర్రబెల్లి స్వర్ణ గారు ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీ సీతారాముల దివ్య ఆశీర్వాదాలు పొందారు.
అనంతరం వారు మాట్లాడుతూ, శ్రీ రామనవమి పర్వదినం ప్రతి ఇంటిలో ఆనందం, శాంతి, సౌభాగ్యాలను నింపాలని, శ్రీరామచంద్రుని కృపాకటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. సమాజంలో ధర్మం, నీతి, సత్యం విలువలు పెంపొందాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
