శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం నూతన సంవత్సరం 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించిన కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
……………………………………….
సాక్షిత : 132 – జీడిమెట్ల డివిజన్ కుత్బుల్లాపూర్ గ్రామంలోని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం ఆవరణలో గాజులరామారం డివిజన్ బతుకమ్మ బండ శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత, హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…. శ్రీ పంచముఖి ఆంజనేయస్వామి ఆశీస్సులతో 2025 సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలతో జీవించాలని అన్నారు. దేవాలయ అభివృద్ధిలో ఆలయ కమిటీ సభ్యులకు నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు.
ఈ కార్యక్రమంలో గాజుల రామారం డివిజన్ బిఆర్ఎస్ నాయకులు ఇబ్రహీం, నయీం, నాగేష్, చెట్ల వెంకటేష్, పరమేష్ పంతులు, బస్వరాజు, అంజయ్య, శరణప్ప, రాచప్ప తదితరులు పాల్గొన్నారు.