SAKSHITHA NEWS

ఏసీబీ అధికారులకే చుక్కలు చూపించిన స్పూర్తి రెడ్డి…!!!

రంగారెడ్డి జిల్లా మణికొండ జల మండలి మేనేజర్ స్పూర్తి రెడ్డి ఏసీబీ అధికారులకు చుక్కలు చూపించారు. కొత్త నల్లా కనెక్షన్ కోసం రూ. 30 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఈమెను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే విచారణ కోసం తాను ఉంటున్న ఇల్లు అడ్రస్ చెప్పకుండా రెండు గంటల పాటు ఏసీబీ అధికారులను తప్పుదోవపట్టించారు స్పూర్తి రెడ్డి.

చివరకు సరైన అడ్రస్ చెప్పడంతో పుప్పాల గూడలో ఆమె ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారుల సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లై అండ్‌ సివరేజ్‌ బోర్డు డివిజన్‌-18 మణికొండ మేనేజర్‌గా స్ఫూర్తిరెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. అయితే మణికొండ మున్సిపాలిటీ నెక్నాంపూర్‌ వెంకటేశ్వర కాలనీకి చెందిన బొమ్మ ఉపేంద్రనాథ్‌రెడ్డి కొత్తగా నిర్మించుకున్న భవనానికి కొత్త నీటి కనెక్షన్‌లు తీసుకునేందుకు అధికారులను కలిశాడు.

ఈ క్రమంలో నీటి కనెక్షన్ కోసం స్పూర్తి రెడ్డి రూ. 30 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మేనేజర్‌ స్ఫూర్తిరెడ్డి, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.

WhatsApp Image 2024 08 21 at 11.06.43

SAKSHITHA NEWS