నగర సంకీర్తనతో ఆధ్యాత్మిక శోభ
** ప్రతి శనివారం గోవింద నామాల గానం
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: శ్రీ వేంకటేశ్వర స్వామివారు కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగునా భక్తి భావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన ప్రతి శనివారం నగర సంకీర్తన చేస్తున్నారు. వందమందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి ఉదయం 5 గంటలకే సాంప్రదాయ వస్త్రాలతో.. నుదుటిపైన గోవింద నామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరు వీధులలో నగర సంకీర్తన చేస్తు నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు. వీరి భక్తి భావానికి అటు భక్తులు, ఇటు స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛందంగా నగర సంకీర్తనలో పాల్గొని పరవశించిపోతున్నారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, వాసుదేవ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మేకల గంగయ్య, కొండే చెంగారెడ్డి, మునినాథరెడ్డి, భాస్కరాచారి, మురళి, తొండము నాటి సుబ్రహ్మణ్యం, అన్నూరు మునిరత్నమాచారి, మధు, పద్మావతి, సిద్ధమ్మ, అరుణ, జయమ్మ, పార్వతి, మునేంద్ర రెడ్డి, కోటి, ముని కృష్ణారెడ్డి, మల్లారపు మణికంఠ, వాసు, అత్తూరు నాగేశ్వరరెడ్డి, బాబు, కల్పన, యశస్విని, విగ్రహాల కళ్యాణి, పార్వతి తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
