రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు

Sakshitha news

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు సందర్భంగా నగరంలో
పథ సంచలన్ రూట్ మార్చ్

సాక్షిత వనపర్తి :
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈరోజు వనపర్తి నగరంలో పథ సంచలన్ రూట్ మార్చ్ నిర్వహించడం జరిగింది.
స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో మొదలైన రూట్ మార్చ్ రెండు బృందాలుగా విడిపోయి ఒకటి గాంధీచౌక్ మరొకటి పీర్లగుట్ట మీదుగా వనపర్తి పురవీధుల గుండా ఒక్కొక్క బృందం మూడున్నర కిలోమీటర్లు రూట్ మార్చ్ అంగరంగ వైభవంగా స్వయంసేవకుల కవాతు నిర్వహించగా నగరంలోని రహదారుల గుండా రూట్ మార్చ్ వెళుతున్నప్పుడు ప్రజలు చాలా పెద్ద ఎత్తున పువ్వులు వెదజల్లి వారి అభిమానాన్ని చాటడం జరిగింది.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా దేశంలోని పట్టణాలు గ్రామాల్లో పెద్ద ఎత్తున శతాబ్ది కార్యక్రమాలు నిర్వహించి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పంచ పరివర్తన ఆచరించాలని సూచించడం జరిగింది రూట్ మార్చిలో ఎల్ల భాస్కర్ కురుమూర్తి తిరుపాజి అమరేందర్ తదితరులు పాల్గొన్నారు