డిగ్రీ అతిథి అధ్యాపకుల ఆవేదన, గోస. పట్టని ప్రభుత్వం
ప్రతినెల 50 వేల జీతం, ఉద్యోగ భద్రత కల్పించాలని….. అతిథి ఆధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ స్వామి డిమాండ్
వనపర్తి :
వనపర్తి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వనపర్తి జిల్లా అతిథి అధ్యాప గోకుల సమావేశం జిల్లా అధ్యక్షురాలు దౌలమ్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన బి వెంకట స్వామి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేసే అతిథి అధ్యాపకుల అందరికీ ఒక సంవత్సరం పని దినాలు ఉంటే ఈ ప్రభుత్వాలు సెమిస్టర్ కు మూడు నెలల చొప్పున ఒక సంవత్సర కాలంలో రెండు సెమిస్టర్ లకు కలిపి ఆరు నెలలు మాత్రమే పని చేయించు కొని, ఆరు నెలల జీతం మాత్రమే ఇస్తున్నాయి. ఈ ఆరు నెలల జీతం కూడా సరిగా ఇవ్వకుండా సంవత్సరానికి ఒకసారి జీతాలు ఇస్తున్నాయి. నెలకు రూ 28080 చొప్పున ఆరు నెలలకు మాత్రమే ఇవ్వడం వలన,నెలకు 14000 రూపాయలు కూడా పడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు ఇలాగే చేస్తుంటేనే ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి అతిథి అధ్యాపకులు ఎంతో కృషి చేయడం జరిగింది. కానీ చివరికి ఈ ప్రభుత్వం కూడా జీతాలు సరిగా ఇవ్వకుండా అతిథి ఆధ్యాపకులను పండుగల సమయంలో కూడా పస్తులుగానే ఉంచుతున్నారు. ఇకనుంచి అయినా ప్రభుత్వం స్పందించి మా యొక్క సమస్యలను పరిష్కరించాలని అతిథి అధ్యాపకుల సంఘం కోరడం జరిగింది. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు…. 1 రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ అతిథి అధ్యాపకుల జీతాలు మూడు నెలల నుంచి అంటే గత జులై, ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలల జీతాలు రాక కుటుంబంతో సహా ఇబ్బందుల లో ఉన్నారు. వెంటనే ఈ మూడు నెలలకు సంబంధించిన జీతాలు ప్రభుత్వం ఇవ్వాలని కోరడం జరిగింది. 2 కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రకటించినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులందరికీ ప్రతినెలా 50 వేల రూపాయల జీతం ఇవ్వాలి. 3 కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 12 నెలల జీతం ఇస్తూ, ఉద్యోగ భద్రత కల్పించాలి. 4 ఇకనుండి ప్రతి నెల నెల జీతాలు ఇవ్వాలి. పై డిమాండ్లను నెరవేర్చుకునేందుకు ప్రభుత్వంపై అనేక రకాలుగా ఒత్తిడి తెస్తామని సమావేశంలో తీర్మానించారు.
