జొన్నవాడ ఆలయ పాలక మండలి సభ్యులకు శుభాకాంక్షలు.
వేమిరెడ్డి దంపతులు.
సాక్షిత : శ్రీ కామాక్షితాయి అమ్మవారి ఆలయ కమిటి ప్రమాణ స్వీకారం సందర్భంగా జొన్నవాడ గ్రామానికి విచ్చేసిన వేమిరెడ్డి దంపతులకు ఆలయ పాలక వర్గ మండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. పుష్ప గుచ్చాలు మరియు శాలువాలతో ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి మేళ తాళాలతో అమ్మవారి దర్శనానికి తీసుకెళ్లారు. కామాక్షితాయి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అర్చకులు వేమిరెడ్డి దంపతులకు తీర్ధ ప్రసాదాలు అందచేశారు. పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమక్షంలో కామాక్షితాయి అమ్మవారి ఆలయ ఛైర్మెన్ గా “తిరుమూరు అశోక్ రెడ్డి” తో పాటు మరో 12 మంది పాలక మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా “ఎంపి ప్రభాకర్ రెడ్డి” మాట్లాడుతూ అమ్మవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు వసతులు, సౌకర్యాలు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కామాక్షి అమ్మవారి ఆలయ కమిటి పాలక మండలి సభ్యలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం “ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి” మాట్లాడుతూ ఆలయ సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ఎలాంటి భంగం కలగకుండా చూడాలని కోరారు. ఆలయ పాలక మండలి విధులకు సంబంధించి ఆమె వివరిస్తూ తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యురాలిగా తన అనుభవాలను కొత్తగా బాధ్యతలు స్వీకరించిన జొన్నవాడ ఆలయ పాలకవర్గానికి తెలిపారు. ఆలయ పవిత్రత కాపాడే విషయంలో దేవస్థాన కమిటి ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. కమిటీ సభ్యులు నిస్వార్ధంగా సేవా భావంతో ఆలయ అభివృద్ధికి పాటు పడాలని ఆమె ఆదేశించారు. అమ్మవారి ఆలయ ఆస్థుల రక్షణతో పాటు గతంలో ఆక్రమణలకు గురైన ఆస్థులను స్వాధీనం చేసుకునే దిశగా ఆలయ కమిటి కృషి చేయాలని కోరారు. కామాక్షమ్మ అమ్మవారి ఆశీసులతోనే తాను ఎమ్మెల్యేగా విజయం సాధించానని అమ్మవారి అనుగ్రహంతో ఆలయ పాలక మండలి సభ్యులుగా అవకాశం దక్కడం పూర్వజన్మ సుకృతమన్నారు. అర్చకులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ వివాదాలకు తావివ్వకుండా నిస్వార్ధంగా పని చేయాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆలయ కమిటి సభ్యులకు సూచించారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట నాయకులు కర్నాటి ఆజనేయులు రెడ్డి, పెన్నా డెల్టా ఛైర్మెన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, బెజవాడ వంశీ కృష్ణారెడ్డి, స్థానిక సర్పంచ్ పెంచలయ్య, బుచ్చి, కోవూరు, విడవలూరు, కొడవలూరు, విడవలూరు, ఇందుకూరు పేట మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుకొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, బెజవాడ జగదీష్,గుత్తా శ్రీనివాసులు,ఏటూరి శ్రీహరి రెడ్డి, నాపా వెంకటేశ్వర్లు నాయుడు, ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి, నియోజకవర్గ పరిధిలోని ఎంపీపీలు, సర్పంచులు యూనిట్ మరియు క్లస్టర్ ఇంచార్జీలతో పాటు కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
