ప్రత్యేక ఓటరు జాబితా సవరణ వేగవంతం చేయాలి….
— సోమరపు లావణ్య…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: గోదావరిఖని, భారతీయ జనతా పార్టీ చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర నాయకురాలు సోమరపు లావణ్య లక్ష్మీనగర్ మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి కార్యక్రమం అమలును పరిశీలించారు.
ఈ సందర్భంగా రామగుండం సమన్వయకర్త కోడూరి రమేష్, మండల అధ్యక్షురాలు ఊరగొండ అపర్ణ, పోలింగ్ కేంద్రాల అధ్యక్షుల ఆధ్వర్యంలో వివిధ పోలింగ్ కేంద్రాల్లో కొనసాగుతున్న ఓటరు నమోదు, వివరాల సవరణ ప్రక్రియను ఆమె సమీక్షించారు. విధులను నిబద్ధతతో నిర్వహిస్తున్న ఎన్నికల సిబ్బందిని అభినందించారు.
అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, సమన్వయంతో పనిచేసి అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా కృషి చేయాలని సూచించారు. ఓటరు జాబితా పూర్తిస్థాయిలో ఖచ్చితంగా ఉండేందుకు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కోడూరి రమేష్, ఊరగొండ అపర్ణ, మణికొండ శ్రీను, మాధవగోయిన రాకేష్, సుల్వ పద్మ, అరెగెల్ల శ్రవణ్, పాశం రాజు, కొమ్మ శ్రీనివాస్, కె. మురళి, జి. భాస్కర్, జనగామ సాగర్, మెరుగు శ్రీను, కొమ్మల స్వామి, కుమారస్వామి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
