- జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ
రైల్వే, ఎన్‌హెచ్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిపెట్టండి
- జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ
….
సాక్షిత : విస్తృత ప్రజాప్రయోజనాలతో ముడిపడిన రైల్వే, జాతీయ రహదారులు (ఎన్‌హెచ్) ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని.. భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అధికారులను ఆదేశించారు.
జాయింట్ కలెక్టర్ ఇలక్కియ మంగళవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఆర్‌డీవోలు, తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. జిల్లా పరిధిలోని రైల్వే, ఎన్‌హెచ్ ప్రాజెక్టులకు సంబంధించిన స్థితిగతులపై సమీక్షించారు. భూ సేకరణలో పురోగతిపై చర్చించారు. ఆర్‌వోబీ, ఆర్‌యూబీ వంటి రైల్వే ప్రాజెక్టులతో పాటు జాతీయ రహదారుల గ్రీన్ ఫీల్డ్ అలైన్‌మెంట్, అవుటర్ రింగ్ రోడ్డు తదితరాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వారి మార్గదర్శకాలకు అనుగుణంగా మంజూరైన ప్రాజెక్టులను వేగవంతం చేయాలని.. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పనుల్లో పురోగతి చూపాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే తమ దృష్టికి తేవాలని.. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడంలో క్రియాశీలంగా వ్యవహరించాలని జేసీ ఇలక్కియ స్పష్టం చేశారు. సమావేశంలో విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య, తిరువూరు ఆర్‌డీవో కె.మాధురి, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
(డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
