వర్షంలో తడుస్తూనే నిరసన దీక్ష
** దీపావళి నుంచైనా వెలుగులు నిండాలి
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: శ్రీవారి మెట్టు వ్యాపారస్తులు సమస్యల పరిష్కారం కోరుతూ గత 427 రోజుల నుంచి నిరసన దీక్ష చేస్తున్నారు. దీపావళి పండుగ రోజున దీపాలు వెలిగించి నిరసన వ్యక్తం చేశారు. వారి దీక్షకు సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎస్.జయచంద్ర హాజరై సంఘీభావం తెలిపారు. జయచంద్ర మాట్లాడుతూ
ఈ సమస్యను పరిష్కరించాలని టిటిడి ఈవోకి అనేకసార్లు విన్నవించుకున్నా… సమస్య పరిష్కరించకపోవడం చాలా బాధాకరం అన్నారు.
అన్ని రకాల పండుగలు టెంట్లోనే చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
గత మూడు రోజుల నుంచి తీవ్రమైన వర్షాలు పడుతున్న…. భారీ వర్షాలు లెక్కచేయకుండా అనారోగ్యాలకు గురవుతూ నిరసన దీక్షను చేస్తున్నారు. పరిపాలన అధికారులు కనీసం మానవతా దృక్పథంతో ఆలోచించక పోవడం బాధాకరం అన్నారు. తిరుమల – తిరుపతి దేవస్థానం “మానవసేవే మాధవ సేవ” అని ప్రచారం చేస్తున్న ఆ పరిపాలన భవనం ముందరే 427 రోజుల నుంచి 31 కుటుంబాలు నిరసన దీక్షలో కూర్చొనుంటే కనీసం పట్టించుకోకపోవడం బాధాకరమైన విషయం.
ఎండకు ఎండి, వానకు తడిసి అక్కడే జీవనం కొనసాగిస్తున్న పరిస్థితిని టీటీడీ యాజమాన్యం కల్పిస్తున్నదని ఆవేదన చెందారు. ఇప్పటికైనా తక్షణమే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాము. లేనిపక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామని సిఐటియు విజ్ఞప్తి చేస్తుంది.
ఈ కార్యక్రమంలో శ్రీవారి మెట్లు వ్యాపారస్తుల సంఘం నాయకులు చిరంజీవి పెంచలయ్య, ప్రకాష్, రామ్మూర్తి, గోపి, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
