చివ్వెంల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన : ఎస్పీ నరసింహ.
- ఆసాంఘిక చర్యలపై కఠినంగా ఉండాలి.
- మహిళ, బాలల భద్రతలో ప్రాధాన్యతతో పని చేయాలి.
- రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రణాళికతో కృషి చేయాలి : సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్. సాక్షిత ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో
చివ్వెంల పోలీస్ స్టేషన్‌ను సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని సిబ్బంది పనితీరును, విధుల పట్ల వారి అంకితభావాన్ని ఆయన నిశితంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో నిర్వహిస్తున్న వివిధ రకాల రికార్డులను తనిఖీ చేశారు. గ్రామాల రికార్డ్స్, కేసుల నమోదు ప్రక్రియ, కేసుల దర్యాప్తు పురోగతి, మరియు పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుల నిర్వహణ తీరును పరిశీలించి, సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా నడుచుకుంటూ, ప్రజలకు మరింత మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించాలి అన్నారు. సైబర్ మోసాలకు గురైన బాధితులకు న్యాయం జరిగేలా, వారి పోగొట్టుకున్న నగదు త్వరగా రిఫండ్ అయ్యేలా తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలి సూచించారు.
మహిళలు బాలల భద్రతలు ప్రాధాన్యతతో పనిచేయాలని ఫిర్యాదులు వస్తే వేగంగా స్పందించి వారికి అండగా నిలవాలని సూచించారు. జిల్లా కేంద్రానికి వచ్చే ప్రధాన రహదారులు చివ్వెంల మండలం మీదుగా ఉన్నాయని, జాతీయ రహదారి 65 రహదారి ప్రధానంగా ఉన్నందున రోడ్డు ప్రమాదాలను నిర్మూలనకు అత్యంత ప్రణాళిక బద్దంగా కృషి చేయాలని తెలిపారు. అలాగే మండల పరిధిలో ఎలాంటి అక్రమ రవాణా సాగకుండా నిఘా ఉంచాలి. అసాంఘిక కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణచివేయాలి అని ఆదేశించారు, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, నేరాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. పాత నేరస్థులు, నిందితులను చట్టప్రకారం బైండోవర్ చేయాలి అన్నారు. ఈ ఆకస్మిక తనిఖీ కార్యక్రమంలో ఎస్పీ గారి వెంట సూర్యాపేట డివిజన్ డిఎస్పీ ప్రసన్న కుమార్, సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, చివ్వెంల ఎస్ఐ మహేష్, మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
