పద్మావతి నగర్ మరియు మునిరెడ్డి నగర్ రెసిడెన్స్ అసోసియేషన్ స్థానికులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది.
పద్మావతి నగర్ మరియు మునిరెడ్డి నగర్ వాస్తవ్యులతో నాకు విడదీయలేని బంధం ఉందని తెలియచేస్తూ.. తిరుపతి ఎలా అభివృద్ధి చెందిందో మీరే చుస్తునారు..తిరుపతిపై నాకున్న ప్రేమ, మమకారం తోనే నేను ఇవ్వనీ చేయగలిగాను.
ఇప్పటివరకు తిరుపతి విద్య, వైద్య నగరంగా మాత్రమే వుంది..ఇకపై తిరుపతి ఆర్థిక నగరంగా కూడా విరాజిల్లబోతుంది..
తిరుపతిలో పెద్దఎత్తున అభివృద్ధి చెందింది కాబట్టే పారిశ్రామికవేత్తల చూపు మన నగరంపై పడింది..
ఇప్పటివరకు 20మాస్టర్ ప్లాన్ రోడ్లే కాకుండా 7ఫ్రీలెఫ్టు రోడ్లు, 5స్లిప్వే రోడ్లు, ఇంటర్నల్ రోడ్లు, కూడళ్ల సుందరీకరణ చేసి ట్రాఫిక్ ఫ్రీ నగరంగా చేయగలిగాను.
భవిష్యత్తులో మరో 14మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మించే ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నాను.
తిరుపతికి భవిష్యత్తులో IT ఇండస్ట్రీ తీసుకొచ్చేలా అడుగులు వేస్తున్నాను. ఇదివరకే పలు మిడ్ సైజ్ కంపెనీ లతో చర్చించడం జరిగింది.
అంతేకాకుండా తిరుపతిని నేరరహిత నగరంగా మార్చడానికి IOT, AI వంటి ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి 4000 సిసి కెమెరాలతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా నీడలో ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాను.
పారిశుధ్యం విషయంలో తిరుపతిని అగ్రస్థానంలో నిలపాలనేదే నా తపన…
ఆలోచించండి.. అభివృద్ధికి ఓటు వేయండి.. రానున్న ఎన్నికలలో అభివృద్ధి కి ఓటు వేసి మీరు అభివృద్ధి లో భాగస్వాములవుతారని ఆశిస్తున్నాను..
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
SAKSHITHA NEWS
DOWNLOAD APP