command కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులపై సమీక్షించిన స్మార్ట్ సిటీ ఎం.డి. అదితీసింగ్
సాక్షిత తిరుపతి : నగరంలో అత్యాధునిక సాంకేతక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనుల పురోగతిపై తిరుపతి స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ అధికారులు, కాంట్రాక్ట్ నిర్వాహకులను సమీక్ష సమావేశం నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ పనుల పురోగతిపై నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఇంజినీరింగ్, ఏఈకామ్, కాంట్రాక్టు ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ అదితిసింగ్ మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు ఆలస్యం అవుతోందని త్వరగా పూర్తి చేయాలని అన్నారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్న ఈ సెంటర్ ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. అధికారులు, నిర్మాణ నిర్వాహకులు సమన్వయం చేసుకుని పనులు వేగంగా పూర్తి చేయాలని అన్నారు. పనుల్లో జాప్యం జరగకుండా అనుకున్న మేర పనుల పూర్తి చేయాలన్నారు. ఈ కేంద్రం ద్వారా నగరంలో భద్రత మరింత పెరుగుతుందని, నగరంలో ఏ మూల ఏమి జరిగినా క్షణాల్లో తెలిసే విధంగా సెంటర్ పనిచేస్తుందన్నారు. అలాగే వాహనాల రాకపోకల నియంత్రణ, నగరంలో కాలుష్య నియంత్రణ, యూజర్ చార్జీల వసూళ్లు, అపరాధ రుసుము విధింపు వంటి కార్యక్రమాలు ఈ సెంటర్ ద్వారానే సాగుతుందన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, మునిసిపల్ ఇంజినీర్ చంద్రశేఖర్, ఏఈకామ్ ప్రతినిధి బాలాజీ, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app