SAKSHITHA NEWS

గ్రామీణ యువత కు స్కిల్ కాలేజ్- ఉద్యోగ ఉపాధి శిక్షణ
రాజమహేంద్రవరం,

తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ భవనం నందు గల, రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజక వర్గ “స్కిల్ కాలేజ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ల సంయుక్త ఆధ్వర్యంలో “సీడాప్-డిడియూ- జికేవై” పధకంద్వారా 18సం నుండి 35 సం. వయోపరిమితి గల గ్రామీణ యువతకు, వృత్తి శిక్షణల ద్వారా, ఉపాధి అవకాశాలను కల్పించేందుకై శిక్షణా తరగతులు సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానున్నాయని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా-స్కిల్ కాలేజ్ కోఆర్డినేటర్ డా. అల్లంరాజు శ్రీరామచంద్రమూర్తి శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి సదుపాయాలు, స్టడీ, సేఫ్టీ మెటీరియల్స్ ను అందిస్తూ, కన్స్ట్రక్షన్ రంగానికి చెందిన “సర్వేయర్ కోర్స్ కు శిక్షణ మరియు ఉపాధి కల్పన జరుగుతుందన్నారు. నిర్నీత వేళలో బోధన,ఓ. జె. టి వృత్యంతర శిక్షణలతో శిక్షణా కార్యక్రమం మూడు నెలలు పైగా ఉంటుందన్నారు. ఈ కోర్స్ లకు అనుబంధం గా ఇంగ్లీష్, ఐ.టి, సాఫ్ట్ స్కిల్స్ నూ బోధించడం జరుగుతుందన్నారు. ఈ కోర్స్ లలో ప్రవేశానికి, “సర్వేయర్” కు: ఇంటర్మీడియట్ లేదా ఐ.టి.ఐ సివిల్,డిప్లొమా సివిల్ లేదా బి. టెక్ సివిల్ చేసిన వారు అర్హులు.

సర్వేయర్ కోర్స్ లో ప్రవేశం కోరే వారు నమోదుకై :
నాక్ ఫాకల్టీ డి.ఎస్.ఎన్. మూర్తి 9666771765 ను సంప్రదించగలరని నైపుణ్యాభివృద్ధిసంస్థ-తూర్పు గోదావరి జిల్లా-స్కిల్ కాలేజ్ కోఆర్డినేటర్ డా. అల్లంరాజు శ్రీరామచంద్రమూర్తి ఆ ప్రకటన లో తెలియజేశారు.


SAKSHITHA NEWS