వాసవి లేఔట్ ZPH స్కూల్‌లో SIR-2026 మెగా హెల్ప్ డెస్క్ క్యాంపు

Sakshitha news

వాసవి లేఔట్ ZPH స్కూల్‌లో SIR-2026 మెగా హెల్ప్ డెస్క్ క్యాంపును ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 276వ డివిజన్ ప్రగతి నగర్ అధ్యక్షులు బొమ్ము వెంకటేశ్వర రెడ్డి (తాతి రెడ్డి) అధ్యక్షతన వాసవి లేఔట్ ZPH స్కూల్‌లో ఏర్పాటు చేసిన SIR-2026 మెగా హెల్ప్ డెస్క్ క్యాంపును కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, SIR-2026 ప్రక్రియపై ఓటర్లకు పూర్తి అవగాహన కల్పించడం, అవసరమైన సమాచారం అందించడం, నమోదు ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలకు సహాయం చేయడం కోసం ఈ మెగా హెల్ప్ డెస్క్ క్యాంపును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

హన్మంతన్న మాట్లాడుతూ, SIR-2026 కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి అర్హులైన ఓటరికి సహాయం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఓటరు వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top