విద్యార్థులకు అండగా కార్పొరేటర్ ముస్తఫా….
ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ బ్యాగుల పంపిణీ…
ముఖ్య అతిధిగా పాల్గొన్న నగర మేయర్ మహంకాళి స్వామి….
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: గోదావరిఖని, 54వ. డివిజన్ జవహర్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 54వ డివిజన్ కార్పొరేటర్ ఎండీ ముస్తఫా ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి హాజరై విద్యార్థులకు బ్యాగులను పంపిణీ చేశారు.
అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించి వారి విద్యాభ్యాసానికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులతో ముచ్చటించిన మేయర్, చదువులో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తుకు విద్యే బలమైన పునాది అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
కార్పొరేటర్ ఎండీ ముస్తఫా మాట్లాడుతూ, విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్కూల్ బ్యాగుల పంపిణీ చేపట్టామని తెలిపారు. విద్యాభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ కొనసాగుతుందని, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాల్వ లింగస్వామి, బొంతల రాజేష్, గట్ల రమేష్, దూళికట్ట సతీష్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
