ఆపద ఉన్న వారికి ఆరోగ్య రక్ష ఎల్వోసీ : బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు….
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ ఎల్పీ విప్ కెపి.వివేకానంద్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరు చేయించిన దాదాపు 2,75,000/- (రెండు లక్షల డెబ్భై ఐదు వేల రూపాయలు) విలువగల రెండు ఎల్ఓసి చెక్కులను ఈరోజు చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన ఎల్ఓసి పత్రాల అందజేత కార్యక్రమానికి ఆయా డివిజన్లకు చెందిన బిఆర్ఎస్ నాయకుల చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ప్రజా నాయకుడు, మన ఎమ్మెల్యే కెపి వివేకానంద్ అని, ఆర్థిక ఇబ్బందులతో మెరుగైన వైద్యం కోసం ఎదురు చూస్తున్నవారు ఎల్ఓసి సదుపాయాన్ని వినియోగించుకోవాలన్నారు.
127 – రంగారెడ్డి డివిజన్….
రంగారెడ్డి నగర్ డివిజన్ కు చెందిన రాజబోయిన సాయిరాం తండ్రి చంద్రయ్య కు రూ.2.00 లక్షలు మంజూరు…
129 – సూరారం డివిజన్…
సూరారం డివిజన్ సంజయ్ గాంధీ నగర్ కు చెందిన జలనీల రాములు తండ్రి కిష్టయ్య కు రూ.75,000/- ( డెబ్భై ఐదు వేల రూపాయలు) మంజూరు…
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, ఎర్వ శంకరయ్య, నాయకులు ఓంకార్ రెడ్డి, క్రాంతి యాదవ్, ఎర్వ సాయి కిరణ్ (బంటి) తదితరులు పాల్గొన్నారు.

