సింగరేణి మారుపేర్లు, నిఘా పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి…
బొగ్గు గని కార్మికుల సమస్యలపై బాయిబాట కార్యక్రమంలో డిమాండ్…
–కల్వకుంట్ల కవిత…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: మంచిర్యాల ప్రాంతంలో కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బాయిబాట కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కల్వకుంట్ల కవిత పాల్గొని సింగరేణి కార్మికుల సమస్యలపై మాట్లాడారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, సింగరేణి సంస్థలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న కార్మికుల మారుపేర్ల సమస్య, నిఘా పెండింగ్ కేసుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
సింగరేణి కార్మికులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మారుపేర్ల సమస్యపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్మిక కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించాలని కోరారు.
భూపాలపల్లి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మారుపేర్ల సమస్యను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీకి రెండు సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఎలాంటి పరిష్కారం చూపకపోవడం పట్ల ఆమె ప్రశ్నించారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పలుమార్లు మారుపేర్ల సమస్యను పరిష్కరిస్తామని, మానవీయ కోణంలో చూస్తామని చెప్పారని, ఇక ఆలస్యం చేయకుండా వెంటనే నిర్ణయం తీసుకుని సింగరేణి కార్మికులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
సింగరేణి కార్మికుల సమస్యలను ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు రియాజ్ అహ్మద్, వెంకట్, పడాల మనోజ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్మిక సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
