బౌరంపేట లో ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు..
శివాజీ సేన యూత్ సభ్యులు వారు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ ..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ బౌరంపేట్ 295 డివిజన్ లో చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా చత్రపతి శివాజీ సేన సమితి సభ్యులు వారు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ .. ఈ సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి బైక్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వారు మాట్లాడుతూ చత్రపతి శివాజీ మహారాజ్ ఒక దర్శనికుడు, యోధుడు-రాజు మరియు మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, హిందువి స్వరాజ్యం స్థాపించినందుకు ప్రసిద్ధి చెందాడు. తన ధైర్యం అద్భుతమైన గేరెల్లా వ్యూహాలు మరియు లౌకిక పరిపాలనకు ప్రసిద్ధి చెందిన ఆయన తన ప్రజలను రక్షించడానికి శక్తివంతమైన మొగల్ ఆదిల్ షాహి మరియు నిజాంశాయి రాజా వంశాలను ధిక్కరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు ఎస్వి సురేందర్ రెడ్డి, మురళి యాదవ్, పాక్స్ డైరెక్టర్ జీతయ్య, యువ నాయకులు విష్ణు యాదవ్, మరియు చత్రపతి శివాజీ సంఘం సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

