SAKSHITHA NEWS

బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని గత 12 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సిద్దేశ్వర పటేల్ దీక్ష విరమణ

గాంధీ హాస్పిటల్ లో బీసీ రాజకీయ నాయకులు బీసీ మేధావుల రౌండ్ టేబుల్ సమావేశం..దీక్షను విరమింప జేసిన నాయకులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ స్పీకర్ మధుసూదనా చారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య

సమగ్ర కుల గణన వెంటనే చేపట్టాలి ,స్థానిక సంస్థల్లో 42% బిసిలకు వాటా పెంచిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలి అని,
గాంధీ హాస్పిటల్ లో 12 రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న సిద్దేశ్వర్ పటేల్ ,ఆమరణ దీక్ష ను విరమించారు. సిద్దేశ్వర్ పటేల్ ఆరోగ్యం కంప్లీట్గా క్షమించింది ఒకటి రెండు రోజులు దీక్ష కొనసాగిస్తే చనిపోయే ప్రమాదం కూడా ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించడం అనివార్యం దానికి కాంగ్రెస్ పార్టీ పరంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అండగా ఉన్నాడు అని భరోసా ఇచ్చాడు.

దీనికి ముందు బీసీ రాజకీయ నాయకులు బీసీ మేధావులు గాంధీ హాస్పిటల్ ప్రాంగణంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి దీక్ష విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ గారు, ఎమ్మెల్సీ మధుసూదన్ చారి గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య


SAKSHITHA NEWS