SAKSHITHA NEWS

శివ దీక్షా విరమణ ప్రారంభం

ఏపీలోని శ్రీశైలంలో నేటి నుంచి కార్తీకమాస శివ దీక్షా విరమణ ప్రారంభం కానుంది.15వ తేదీతో ముగిసే ఈ కార్యక్రమానికి పాతాళగంగా మార్గంలోని శిబిరాల్లో ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు చెప్పారు.గత నెల2న మండల దీక్ష, 21న అర్థమండల దీక్ష స్వీకరించిన భక్తులు కూడా విరమించవచ్చన్నారు. ఇవాళ ఉదయం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో ఆశీనులను చేసి విశేష పూజలు నిర్వహించనున్నారని తెలిపారు


SAKSHITHA NEWS