SAKSHITHA NEWS

షిఫా హాస్పిటల్ & లేసర్ కీడ్నీ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

గద్వాల జిల్లా కేంద్రంలోని 2వ రైల్వే గేట్, సమీపంలో నూతనంగా షిఫా హాస్పిటల్ & లేసర్ కీడ్నీ సెంటర్ ను ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు.

నూతన షిఫా హాస్పిటల్ & లేసర్ కీడ్నీ సెంటర్ ను ఎమ్మెల్యే రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగినది .

ఎమ్మెల్యే కి డాక్టర్ యం.డి . షఫీక్ శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు .

ఎమ్మెల్యే హాస్పిటల్ లో ఆపరేషన్ థియేటర్, వైద్య పరికరాలను పరిశీలించిన జరిగినది.

ఎమ్మెల్యే మాట్లాడుతూ…..

గద్వాల ప్రాంతంలో దినదిన అభివృద్ధి చెందుతుంది కొత్త టెక్నాలజీ ప్రజలు వివిధ రకాల ఆరోగ్య సమస్యల పైన హైదరాబాద్ కర్నూల్ వంటి ప్రాంతాలకు వెళ్లి చికిత్సలు పొందేవారు. కానీ ఇప్పుడు గద్వాలలో అన్ని రకాల రోగాలకు సంబంధించిన హాస్పిటల్, లేజర్ ల్యాబ్ రావడంతో ప్రజలకు అందుబాటులో ఎన్ని రకాల సౌకర్యాలు లభిస్తున్నాయి ప్రతి ఒక్కరు వీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

భవిష్యత్తులో గద్వాల నియోజకవర్గం మీరు వ్యాపారం సంస్థ లో రావాలి గద్వాల్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, మాజీ ఎంపీపీ విజయ్, కౌన్సిలర్స్ మురళి సాయి శ్యామ్ రెడ్డి, నరహరి శ్రీనివాసులు, దౌలు, రామకృష్ణ శెట్టి, వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఆంజనేయులు, నాయకులు గద్వాల తిమ్మప్ప ఆనంద్ గౌడు, ధర్మ నాయుడు, మోబిన్ సంగాల నర్సింహులు, కొత్త గణేష్, మధు,షాషా,mk ప్రవీణ్, మండలం యూత్ వైఎస్ ఉపాధ్యక్షుడు యోగి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS