SAKSHITHA NEWS

ఏపీ హజ్ కమిటీ చైర్మన్ గా షేక్ హసన్
భాషా

అమరావతి :

ఏపీ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ భాషాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరుకు చెందిన హసన్ భాషా సుదీర్ఘకాలంగా టీడీపీ లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన టీడీపీ కేంద్ర కార్యాలయంలో రిసెప్షన్ ఇన్చార్జిగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో హసన్ భాషా ఏపీ హజ్ కమిటీ డైరెక్టర్ గా పనిచేశారు.