SAKSHITHA NEWS

నూతన సంవత్సరం సందర్భంగా శంభీపూర్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి పుష్పగుచ్చాలు అందజేసి, శాలువాలతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శంభీపూర్ రాజు సైతం శుభాకాంక్షలు తెలియచేస్తూ, 2025 ప్రజలకు ఆనందాల సంవత్సరం కావాలని, ప్రతి ఇంటా నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలు, సంపద, సమృద్ధి కలగాలని శంభీపూర్ రాజు ఆకాంక్షించారు


SAKSHITHA NEWS