బుగ్గారంలో పి.ఎ.సి.ఎస్. ఏర్పాటు చేయండి

బుగ్గారంలో పి.ఎ.సి.ఎస్. ఏర్పాటు చేయండి

SAKSHITHA NEWS

P.A.C.S. in Buggaram. Arrange

బుగ్గారంలో పి.ఎ.సి.ఎస్. ఏర్పాటు చేయండి
గత ప్రతిపాదనలు అమలు పరచి రైతులను ఆదుకోవాలి
జిల్లా అదనపు కలెక్టర్ ను కోరిన చుక్క గంగారెడ్డి

సాక్షిత బుగ్గారం / జగిత్యాల జిల్లా:
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పి. ఎ.సి.ఎస్.) ఏర్పాటు చేయాలని మండల అభివృద్ది కమిటి కన్వీనర్ చుక్క గంగారెడ్డి ఆధ్వర్యంలో శనివారం జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు ను కలిసి విజ్ఞాపన పత్రం అందజేశారు.

గతంలో కూడా అనేక పర్యాయాలు విజ్ఞాపనలు చేయగా జిల్లా సహకార అధికారి ద్వారా ప్రకటనలు జారీ చేసి, ప్రతిపాదనలు పంపారని చుక్క గంగారెడ్డి అదనపు కలెక్టర్ రాంబాబు కు వివరించారు. వెంటనే అట్టి ప్రతిపాదనలను అమలు పరచి, బుగ్గారం లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేసి మండల రైతులను ఆదుకోవాలని చుక్క గంగారెడ్డి కోరారు. ఆయన వెంట దళిత లిబరేషన్ ప్రంట్ రాష్ట్ర కార్యదర్శి మార్వాడి సుదర్శన్, గ్రామ అభివృద్ది కమిటి యొక్క కోర్ కమిటీ వైస్ చైర్మన్ పెద్దనవేణి రాఘన్న, పరుమాల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 06 19 at 12.37.58

SAKSHITHA NEWS