SAKSHITHA NEWS

సమాజానికి సేవ చేయడం ఒక సామాజిక బాధ్యత

సాక్షిత శంకరపల్లి : ఉపాధ్యాయుడు,మరియు సామాజిక కార్యకర్త మర్పల్లి అశోక్ ఇటీవల రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ ప్రధానం చేసిన జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న సందర్భంగా శంకర్పల్లి మండలంలోని క్రిస్టల్ టౌన్షిప్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మర్పల్లి అశోక్ ని శాలువ,పూలమాలలతో ఘనంగా సత్కరించడం జరిగింది.ఈ సందర్భంగా కాలనీ పెద్దలు గోవింద్ రెడ్డి,మరియు సభ్యులు గోపాల్ రెడ్డి,శ్రీశైలం,మల్లేష్ యాదవ్,సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ… పేద విద్యార్థుల చదువు కోసం అనేక సేవలు అందించడం వల్ల జిల్లా స్థాయిలో అవార్డు అందుకున్నటువంటి ఉపాధ్యాయుడు మా కాలనీలో ఉండడం మాకు గర్వకరాణమని,ప్రభుత్వ బడుల్లో చదువుకునే పేద విద్యార్థులకు అవసరమైనటువంటి పుస్తకాలు,బ్యాగులు, పెన్నులు,పలకలు తదితర సామాగ్రిని పిల్లల చదువు కోసం అందజేస్తూ, తల్లిదండ్రులకు పిల్లల చదువు భారం కాకుండా తన యొక్క సేవలను అందిస్తూ,శంకర్పల్లి మండలంలోనే ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడం జరిగిందన్నారు. మునుముందు మరిన్ని విద్యాపరమైన సేవ, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ,రాష్ట్ర, జాతీయస్థాయి అవార్డు అందుకోవాలని ఆకాంక్షించడం జరిగింది.

ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు మర్పల్లి అశోక్ మాట్లాడుతూ… నీతి,నిజాయితీతో,నిస్వార్థ సేవలు అందిస్తు బడుగు బలహీన వర్గాల పిల్లల కోసం అనునిత్యం కృషి చేస్తున్నందుకు గాను జిల్లా స్థాయి పురస్కారం అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేస్తూ,పేద విద్యార్థులకు సేవ చేయడంలో దొరికేటటువంటి సంతృప్తి మరెందులో దొరకదని ఉపాధ్యాయ వృత్తి అనేది జీతం కోసం చేసేది కాదని, జీవితాలను తీర్చిదిద్దే ఉన్నతమైన వృత్తి అని తెలపడం జరిగింది.మనం ఏ వృత్తిలో కొనసాగిన,ఏ ప్రాంతంలో నివసించిన సమాజ సేవ అనేది ఒక సామాజిక బాధ్యతగా గుర్తించాలని,మనం సంపాదించిన దాంట్లో కొంత సమాజానికి చెల్లిస్తే అది మనకు ఎంతో సంతృప్తినిస్తుందని తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో విక్రమ్ రెడ్డి,సువాన్ రెడ్డి,ప్రవీణ్ రెడ్డి,శివ గౌడ్,రవి,శ్రీశైలం గౌడ్,శ్రీనివాస్,రాము, అనిరుద్,సాయి,రాకేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS