service group పేద విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందించిన త్రిశక్తి సేవా సమితి…
service group సాక్షిత : రోజు రోజుకు పెరుగుతున్న విద్యా ఖర్చులను దృష్టిలో పెట్టుకొని పేద విద్యార్థులకు చేయూతగా స్వచ్ఛందంగా సేవ చేయాలనే సంకల్పంతో ఆనంద్ బాగ్ లో నెలకొల్పిన త్రిశక్తి సేవా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న
అనేక కార్యక్రమాలలో భాగంగా నేరేడ్మెట్ లో గల సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంచార జాతుల బాలుర ఆవాసం విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్ పెన్నులు స్టేషనరీ సామాన్లు..స్వీట్లు అందించిన కమిటీ సభ్యులు…
ఈ కార్యక్రమంలో త్రిశక్తి సేవా సమితి నిర్వాహకురాలు ఎం సూర్య కుమారి మాట్లాడుతూ..
సంస్థ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు వారి అభివృద్ధికి తోడ్పాటుగా ఉడుతా సహాయంగా మేము చేస్తున్న ఈ కార్యక్రమం మాకు చాలా సంతోషాన్నిచ్చిందని..
అలాగే ఇలాంటి కార్యక్రమాలు మునుముందు చేసి మాకు చేతనైన అంతవరకు ఇతరులకు సహాయం చేయడమే మానవసేవే మాధవసేవ అవుతుందని…
భగవంతుడు మాకు ఇంకా సేవ చేసే ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నా అని అన్నారు
కార్యక్రమంలో సంస్థ సభ్యులు కె.రవి , రామసాయి , శశి , శైలజ, శమయ కుమారి, శేషు కుమార్ మరియు సంస్థ ఇతర సభ్యులు ఈ సేవలో పాల్గొనడం జరిగింది.
కార్యక్రమం చివరలో అవాసం నిర్వాహకులు రవీంద్రనాథ్ కృతజ్ఞతలు తెలియచేసారు.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
SAKSHITHA NEWS
download app