SAKSHITHA NEWS

కరీంనగర్ -వరంగల్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

కరీంనగర్ జిల్లా:
కరీంనగర్ జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హుజురాబాద్ మండలం మాందాడిపల్లిలో వరంగల్ – కరీంనగర్ జాతీయ రహదారిపై పొగ మంచుతో రోడ్డు కనిపించక అదుపుతప్పి లారీ చెట్టును ఢీ కొట్టింది.

ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్‌లో ఇరుక్కుని క్లీనర్ తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించే క్రమంలో క్లీనరు మృతి చెందాడు.

డ్రైవర్‌ను అతి కష్టం మీద స్థానికులు, ఫైర్ సిబ్బంది సహాయంతో బయటకు తీశారు. తీవ్రంగా గాయ పడిన డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీ సులు పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ అస్పత్రికి తరలించారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


SAKSHITHA NEWS