SAKSHITHA NEWS

వనపర్తిలో సీనియర్ vs జూనియర్_

ఎమ్మెల్యే మేఘారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి మధ్య వర్గపోరు

మర్రికుంట నుంచి గోపాల్ పేట్ బస్ సర్వీస్ ప్రారంభోత్సవంలో రచ్చ

గతంలో ఇదే రూట్ బస్సును ఎమ్మెల్యే మేఘారెడ్డికి తెలియకుండా చిన్నారెడ్డి ప్రారంభోత్సవం చేయడానికి ప్రయత్నం చేశారు.. కానీ ఎమ్మెల్యే అధికారులకు ఫోన్ చేసి నేను లేకుండా ప్రారంభోత్సవం జరగొద్దు అని చెప్పేసరికి వాయిదా పడ్డ బస్ ప్రారంభోత్సవం..

అనంతరం కొద్ది రోజులకే చిన్నారెడ్డి లెకుండా బస్ సర్వీస్ ప్రారంభించారు ఎమ్మెల్యే మేఘారెడ్డి… దీంతో విషయం తెలుసుకున్న చిన్నారెడ్డి వర్గీయులు క్యాబినెట్ హోదా కలిగిన మా నాయకుడు లేకుండా ప్రారంభించడం ఏంటని అడ్డుకునే ప్రయత్నం చేశారు..

దీంతో పోలీసులు కలగచేసుకొని ఇరువర్గాలుకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు..

బస్సుల కోసం ప్రజలు పడుతున్న కష్టాలు పట్టించుకోకుండా బస్ సర్వీస్ ప్రారంభోత్సవంలో ఈ గొడవలు ఏంటని ఛీ కొడుతున్నారు అక్కడి ప్రజలు.


SAKSHITHA NEWS