గుంటూరు జిల్లా పోలీస్…
//సివిల్(Civil), ఎపిఎసిపి(APSP) కానిస్టేబుళ్ళుగా ఎంపికైన వారు ఈ ఆగస్టు నెల 23వ తేదిన సర్టిఫికెట్లతో హాజరు కావాలి.– గుంటూరు జిల్లా ఎస్పీ యస్. సతీశ్ కుమార్, ఐపీఎస్.//
…..
సాక్షిత : గుంటూరు పోలీసు పెరేడ్ గ్రౌండ్లో అన్ని జిల్లాల నుండి SCT కానిస్టేబుళ్ళ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియకు హాజరై, SCT సివిల్, ఎపిఎస్పీ ఉద్యోగాలకు ఎంపికైన పురుష, స్త్రీ అభ్యర్థులు ఈ నెల 23న జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ఉదయం 10 గంటలకు హాజరుకావాలని జిల్లా ఎస్పీ ఎస్. సతీశ్ కుమార్, ఐపీఎస్ , ఆగస్టు 20న ఒక ప్రకటనలో తెలిపారు.
అభ్యర్ధులు సెలక్షన్ ప్రక్రియలో అప్లికేషనుతో జతపర్చిన అన్ని ధృవ పత్రాల ఒరిజినల్ సర్టిఫికేట్స్, గెజిటెడ్ అధికారితో అటెస్టేషను చేయించిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలను, నాలుగు పాస్పోర్టు సైజ్ కలర్ ఫోటోలను తీసుకుని రావాలని ఎస్పీ తెలిపారు.
— సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, గుంటూరు.
