చిరంజీవి జన్మదిన వేడుకలు
బొప్పడిలో ప్రత్యేక పూజలు, అన్నదానం
సాక్షిత చిలకలూరిపేట:మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా, బొప్పడి గ్రామంలోని ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ఆయన పేరు మీదగా మెగా అభిమాన సంఘాల నాయకులు, జనసేన పార్టీ నాయకులు ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అచ్చుకోల అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు చిరంజీవి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాల కోసం అర్చనలు జరిపారు.ఈ సందర్భంగా అచ్చుకోల అరుణ్ కుమార్ మాట్లాడుతూ, సేవాభావం అంటే ఏమిటో, దాని రుచి ఎలా ఉంటుందో చిరంజీవి ఆంధ్రప్రదేశ్ తో పాటు పక్క రాష్ట్రాల అభిమానులకు కూడా నేర్పించారని కొనియాడారు. “అటువంటి గొప్ప మహానుభావుడు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము” అని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గోవిందు గణేష్, ఎస్.ఆర్., తోట కృష్ణమూర్తి, ఆశా రాధాకృష్ణ, గుండుబోలు శివ, గుర్రం నాగేంద్ర, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
