సీసీరోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి ప్రత్తిపాటి శంకుస్థాపన
రూ.33 లక్షలతో నిర్మించనున్న సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, తాగునీటి పైపుల ఏర్పాటు పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే
కూటమి ప్రభుత్వంలో పరుగులు పెడుతున్న పట్టణాభివృద్ధిలో భాగంగా శనివారం స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పలు సీసీరోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నా దేశం నా బాధ్యత నినాదాన్ని ఆచరణ సాధ్యం చేసే క్రమంలో ఎలక్ట్రికల్ స్కూటీపై పర్యటించిన ప్రత్తిపాటి.. పట్టణంలో జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి పనుల్ని స్వయంగా పరిశీలించారు. 20కి.మీ పైగా స్కూటీపై తిరిగిన ప్రత్తిపాటి.. స్ధానిక 7 వ వార్డులో బస్టాండ్ వద్ద రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైన్లు, నూతన తాగునీటి పైప్ లైన్ ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం అదే వార్డులో గుంటూరు ఆర్&బీ రోడ్డు అనుసంధానిస్తూ రూ.13 లక్షలతో వేయనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. చివరిగా 11వ వార్డులో కబేళా వద్ద రూ.10 లక్షలతో వేయనున్న సీసీరోడ్డుకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, మున్సిపల్ అధికారులకు పట్టణాభివృద్ధిపై ప్రత్తిపాటి కీలక సూచనలు చేశారు.
కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ రఫాని, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు ముల్లా కరీముల్లా, మురకొండ మల్లిబాబు, బేరింగ్ మౌలాలి, కొత్త కోటేశ్వరరావు, సుభాని, మజీద్, బాజీ, మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి, డిఇ అబ్దుల్ రహీమ్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, కూటమి నాయకులు, టీడీపీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
