మానవ అక్రమ రవాణా బాధితుల రక్షణ, రెస్క్యూ, పునరావాసం చట్టం-2015 పై అవగాహన కలిగి ఉండాలి……డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ డి కృష్ణయ్య.
సాక్షిత వనపర్తి : మానవ అక్రమ రవాణా కు గురి కాకుండా జాగ్రత్త వహించి ఈ చట్టం యొక్క రక్షణ, పునరావాసం పట్ల అవగాహన కల్గి ఉండాలని డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ డి కృష్ణయ్య అన్నారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ జిల్లా కార్యదర్శి శ్రీమతి జి. కళార్చన ఆదేశాలనుసారo శనివారం వనపర్తి జిల్లా రాజాపేట గ్రామంలోని వంద రోజుల ఉపాధి హామీ కార్మికులకు చట్టాలపై అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో కృష్ణయ్య మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా బాధితుల రక్షణ, రెస్క్యూ మరియు పునరావాసం కోసం చట్టపరమైన సహాయాన్ని అందించడానికి రూపొందించబడింది.
ఈ పథకం బాధితులకు ఉచిత న్యాయవాది, పరిహారం, మరియు వారి హక్కుల పరిరక్షణతో పాటు, వారి సామాజిక-ఆర్థిక పునరావాసాన్ని కూడా కల్పిస్తుంది. అదే విధంగా 18 సంవత్సరాల లోపు బాలికకు, 21 సంవత్సరాల లోపు బాలురకు వివాహాలు జరిపించడం చట్టరీత్యా నేరం అని తెలియజేశారు. అదేవిధంగా బాల కార్మికుల నిర్మూలన చట్టం గురించి తెలిపారు. ఉచిత న్యాయ సలహాల కొరకు 15100 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ శ్రీదేవి,ఫీల్డ్ ఆఫీసర్ మరియు బుక్ కీపర్ పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
