కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన S. S & N. కళాశాల విద్యార్థులకు సన్మాన కార్యక్రమం

Sakshitha news

కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన S. S & N. కళాశాల విద్యార్థులకు సన్మాన కార్యక్రమం…

సాక్షిత : ఇటీవల రాష్ట్ర పోలీస్ శాఖ నిర్వహించిన కానిస్టేబుల్ నియామక పరీక్షల్లో ఎంపికైన స్థానిక శ్రీ సుబ్బరాయ & నారాయణ కళాశాల 15 మంది విద్యార్థులు పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు, ఒకరు CISF కానిస్టేబుల్ పోస్టుకు, ఒకరు Agniveer గా విజయవంతంగా ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ Dr. M. S. సుధీర్ ఒక ప్రకటనలో తెలియచేశారు. ఈ గర్వకారణమైన విజయాన్ని పురస్కరించుకుని, ఎంపికైన వారికి కళాశాల ఆడిటోరియం లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా పల్నాడు జిల్లా S.P. . K. శ్రీనివాసరావు IPS హాజరై, NCC కేడేట్ల నుండి వందనం స్వీకరించి, ఎంపికైన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా విచ్చేసిన పల్నాడు జిల్లా S.P. . K. శ్రీనివాసరావు IPS మాట్లాడుతూ నేటి యువత చెడు వ్యసనాలకు బానిసలు అయిపోతున్నారని, విద్య కన్నా సమాజానికి హానికరమైన విషయాలలో ఎక్కువ జ్యోక్యం చేసుకుంటున్నారని అన్నారు.

మద్య పానం, ధూమపానం, గంజాయు లాంటి మత్తు పదార్థాలకు బానిసలు అయి జీవితాలను అర్దాంతరగా చాలిస్తున్నారని అన్నారు. విద్యపై దృష్టి సారించి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒదిగి ఎదగాలని పేర్కొన్నారు. రానున్న రోజులలో Friendly police పేరుతొ SP ఆఫీసులో స్కూలు మరియు కళాశాలల విద్యార్థినీ విద్యార్ధులకు ఒక రోజు ఉదయం నుండి సాయంత్రం వరకూ శారీరక, మానసిక శిక్షణా, పోలీసు వారి విధులు, వారు ఉపయోగించే ఆయుధాలు వారి యొక్క ఉపయోగాలు తెలియచేడం జరుగుతుందని తెలియచేశారు. ఎంపికైన NCC కేడట్లను మరియు స్టూడెంట్ ల ప్రతి ఒక్కరి స్థితి గతులను మరియు వారి గ్రామాల పరిస్తితులు తెలుసుకొని ఎలా మెలగాలో తెలియచేశారు. ఈ కార్యక్రమానికి అతిధిగా 23 ఆంధ్రా బెటాలియన్ NCC హవల్దార్ శ్రీ. షంషేర్ సింగ్ పాల్గొన్నారు. ఎంపికైన విద్యార్థుల కృషిని ప్రశంసిస్తూ, ఇది ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని ఈ గొప్ప విజయం కళాశాలకు గర్వకారణం అని కళాశాల ప్రెసిడెంట్ శ్రీ. కపలవాయి విజయకుమార్ తెలియచేశారు. విద్యార్థులు పోలీస్ శాఖలో చేరడం ఒక సామాజిక బాధ్యతతో కూడిన విషయం అని, భవిష్యత్తులో విద్యార్థులు మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరేందుకు కళాశాల నుండి పూర్తి మద్దతు ఉంటుందని కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ మరియు నరసరావుపేట మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ నాగసరపు సుబ్బరాయ గుప్తా పేర్కొన్నారు. విద్యార్ధులు ఎంపికవడానికి కళాశాల N.C.C. ఆఫీసర్ మేజర్ B. S. రామ కృష్ణ రాజు చక్కటి శిక్షణ ఇచ్చారని కార్యక్రమానికి విచ్చేసిన వక్తలు ప్రశంసించారు. ఈ సందర్భంగా ఎంపికఅయిన వారిని కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. P. శ్రీనివాస సాయి, పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ ఇంచార్జ్ శ్రీ. M. అనిల్ కుమార్ అధ్యాపకులు అభినందించారు.