పాత ఇనుము, ప్లాస్టిక్ వ్యాపారులతో మున్సిపల్ కమిషనర్ పి.శ్రీహరిబాబు సమావేశం
సాక్షిత : చిలకలూరిపేట పట్టణంలో ఉన్న పాత ఇనుప కొట్టు వ్యాపారులతో మున్సిపల్ కమిషనర్ పీ శ్రీహరిబాబు తన ఛాంబర్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ పీ.శ్రీహరిబాబు మాట్లాడుతూ పాత ఇనుము, ప్లాస్టిక్ సామానులు కొనుగోలు చేసే వ్యాపారులు
నివాసాల చుట్టూ పక్కల షాపులు లేకుండా చర్యలు తీసుకోవాలని అదే విధముగా పాత సామానులు కొనుగోలు చేసి మున్సిపల్ కాల్వల పైన, కాల్వలు మురుగు తొలగించకుండా అడ్డుగా వెయ్యడం ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడం లాంటివి చేయొద్దని అన్నారు, ఎటువంటి వస్తువులైన మురుగు కాల్వలకు లోపల వైపున మాత్రమే వేసుకోవాలన్నారు,
అంతేకాకుండా షాపుల చుట్టూత ఉన్న కాల్వల్లో వ్యర్థాలతో నింపిన యెడల జరిమానా విధించడం జరుగుతుందని వ్యాపారులకు హెచ్చరించారు, ముఖ్యంగా
పాత ఇనుము మరియు ప్లాస్టిక్ కొనుగోలు చేసే ప్రతి ఒక్కరూ ట్రేడ్ లైసెన్స్ తప్పని సరిగా తీసుకోని ట్రేడ్ లైసెన్స్ పొందిన వారు మున్సిపల్ కార్యాలయం నందు నమోదు చేసుకున్నట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు కల్పించే వివిధ సబ్సిడీ రుణాలు పొందేందుకు అర్హులు అవుతారని సూచనలు చేశారు. అంతేకాకుండా పట్టణంలో వివిధ ప్రాంతాల్లో ప్లాస్టిక్ బాటిల్స్ ఏరుకొని షాపులలో విక్రయించే వారిని గుర్తించి వారికి గుర్తింపు కార్డులతో పాటుగా వారికి ఉచిత హెల్త్ కార్డులు వివిధ ప్రభుత్వ పథకాలు అందజేయడం జరుగుతుందని దీనికి మీ వంతగా మీ షాపుల పరిధిలో ప్లాస్టిక్ తదితర వస్తువులు విక్రయించడం చేసే వారిని అవగాహన కల్పించి ఆయా సచివాలయాల పరిధిలో వారు పేర్లు నమోదు చేయంచాలని పేర్కొన్నారు.. ఈ సమావేశంలో శానిటరీ ఇనస్పెక్టర్ లు సిహెచ్ రమణారావు, సునీత , సచివాలయ శానిటేషన్ సెక్రటరీలు, పాత ఇనుప కొట్టు వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు
