అంగన్వాడీ కేంద్రానికి ఎస్బిఐ సిఎస్ఆర్ సహకారం అభినందనీయం
ఐసిడిఎస్ పిడి : నరసింహారావు
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట అర్బన్ భగత్ సింగ్ నగర్ అంగన్వాడి కేంద్రం 2కు ఎస్బిఐ సహకారం అభినందనీయమని ఐసిడిఎస్ పిడి నరసింహారావు అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్బిఐ మేనేజర్ నరసింహారావు కిషోర్లు, అదేవిధంగా మిత్ర హోలీ స్టిక్స్ హెల్త్ సొసైటీ చైర్మన్ లక్ష్మీరెడ్డి లు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు ఎస్బిఐ పాన్ ఇండియా సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఎస్బిఐ ఆధ్వర్యంలో పిల్లలకు అవసరమైన అనేక ఉపకరణాలను అందజేస్తున్నారని తెలిపారు.ఎల్ఈడి టీవీలు రైస్ కుక్కర్లు వాటర్ ఫిల్టర్లు స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్లు గ్లాసులు కప్పులు పిల్లలకు సంబంధించిన పలకలు పుస్తకాలు పెన్సిల్లు తదితర సామాగ్రిని పంపిణీ చేస్తున్నామన్నారు.అంగన్వాడీ పిల్లలకు ఇలాంటి సామాగ్రిని అందించడం సంతోషంగా ఉందని చెప్పారు.పిల్లల విద్యా పోషణ అభివృద్ధి ఇలాంటి సేవలు ఎంతో ఉపయోగ పడుతాయన్నారు.
పిల్లలకు ప్లేట్లు వాటర్ బాటిల్ బ్యాగులు పంపిణీ చేశారు.కార్యక్రమంలో సిడిపిఓ సుబ్బలక్ష్మి సూపర్వైజర్ శ్రీదేవి వార్డు కౌన్సిలర్ కీర్తి అంగన్వాడీ టీచర్ అరుణాదేవి తదితరులు పాల్గొన్నారు

