30న ముఖ్యమంత్రి తిరుపతి పర్యటన

Sakshitha news

30న ముఖ్యమంత్రి తిరుపతి పర్యటన

** అధికారులంతా అప్రమత్తంగా ఉండండి

** సన్నాహక సమావేశం లో మున్సిపల్ కమిషనర్

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 30న తిరుపతి పర్యటనలో అధికారులు అందరూ అప్రమతంగా ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. ఈ నెల 30న తిరుపతిలో జరగనున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ మేరకు సాయంత్రం ఆయన పర్యటించనున్న ప్రాంతాల్లో ఏర్పాట్లను అధికారులతో కలసి కమిషనర్ మౌర్య పర్యటించారు. అన్ని మార్గాల్లో పారిశుధ్థ్యం మెరుగ్గా చేపట్టాలని, బారికేడ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే భద్రతా ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని పోలీస్ అధికారులకు సూచించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట ట్రైనీ కలెక్టర్ రఘువంశీ, అదనపు కమిషనర్ శారదా దేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మునిసిపల్ ఇంజనీర్ తులసికుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, మున్సిపల్ డీఈఈ శిల్ప, ఈస్ట్ డిఎస్పి భక్తవత్సలం, మేనేజర్ హాసీమ్, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య, తదితరులు ఉన్నారు.

Scroll to Top