SAKSHITHA NEWS

సూర్యాపేటలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి.

పూల మాల వేసి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : సావిత్రిబాయి పూలే త్యాగాలతోనే సమాజంలో మార్పు మొదలు అయిందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశమందిరం లో సావిత్రిబాయి పూలే జయంతి లో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు తో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పాల్గొని పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర దేశంగా అవతరించక ముందే దేశంలో ఉన్న అణగారిన సమాజం కోసం, స్త్రీల హక్కుల కోసం విద్య కోసం మహాత్మ జ్యోతిరావు పూలే దంపతులు సామాజిక రాజకీయ సాంస్కృతిక పరివర్తన కోసం పోరాటం చేశారని వారి పోరాట ఫలిత మూలంగానే నేడు స్త్రీలు స్వేచ్ఛ సమానత్వ సోదరభావ హక్కులు పొందుతూ చదువుకోగలుగుతున్నారని తెలిపారు.అందులో భాగంగానే మహాత్మా జ్యోతిరావు పూలే భార్య అయిన సావిత్రిబాయి పూలే కృషి త్యాగం పోరాటం మూలంగానే నేడు మహిళలు విద్యను అభ్యసించే హక్కును పొందుతున్నారని తెలిపారు.నాడు సావిత్రిబాయి పూలే చేసిన కృషి, త్యాగం మూలంగానే నేడు ఆధునిక భారతదేశ చరిత్రలో తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా చరిత్రకి ఎక్కడమే కాకుండా నిజమైన చదువుల తల్లిగా పిలువబడుతూ మేధావులు చేత, విద్యావంతుల చేత,సామాన్యుల చేత మన్ననలు పొందుతున్నారని అన్నారు. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో, ఖండాలా తాలూకాలోని నయాగావ్ గ్రామంలో జనవరి 3 న 1831 లో సావిత్రిబాయి జన్మించింది.ఆనాటి సామాజిక కట్టుబాట్ల దృష్ట్యా తన తొమ్మిదవ యేటనే జ్యోతిరావు పూలేతో సావిత్రిబాయికి వివాహం జరిగిందని పూలే దంపతులకి వివాహమైన తదనంతరం సాంప్రదాయక జీవితంలో భాగంగా పిల్లలు కనాలని ఆలోచన లేకుండా సమాజంలో వెనుకబాటుకి గురవుతున్న పీడితులే తమ బిడ్డలుగా భావించి సొంత బిడ్డల్ని కూడా లేకుండా అణగారిన సమాజం కోసం,మహిళల అభ్యున్నతి కోసం సామాజిక రాజకీయ పోరాటాలు చేశారని అన్నారు. మహిళల సామాజిక రాజకీయ హక్కుల కోసం, మహిళల విద్య కోసం పూలే దంపతులు మనో సంకల్ప బద్ధులై మొట్టమొదటిసారిగా 1848 లో పూణేలో ఒక ఇంట్లో బాలికల పాఠశాలను ప్రారంభించారు. నిరక్షరాస్యులైన సావిత్రిబాయిని మహాత్మా జ్యోతిరావు పూలేనే స్వయంగా విద్యావంతురాలని చేసి తాము స్థాపించిన పాఠశాలకి ప్రధాన మహిళా విద్యావంతురాలని చేశాడు. వారి స్థాపించిన మొదటి పాఠశాలలో 9 మంది విద్యార్థులు చేరగా వారికి సావిత్రిబాయి పూలే గారే ప్రధానోపాధ్యాయురాలు

.వీరు స్థాపించిన మొదటి పాఠశాల ఆరు నెలలపాటు కొనసాగి మూతపడింది. కొన్ని నెలల తర్వాత మరొక భవనంలో మళ్లీ పాఠశాలని ప్రారంభించారు, అది నిర్వహిస్తున్నందుకుగాను నాటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా తీవ్రమైన వ్యతిరేకతని పూలే దంపతులు ఎదుర్కొన్నారని తెలిపారు. సమాజం లో మార్పు ఉపాధ్యాయ వృత్తి తోనే సాధ్యం అవుతుందని మహాత్మా జ్యోతి బాపూలే తన భార్య ని టీచర్ గా మార్చారని తెలిపారు. ఆమెను స్ఫూర్తి గా తీసుకొని ఆమె అడుగుజాడల్లో మనమందరం నడుస్తూ సమాజం లో మార్పు తేవటానికి ప్రతి ఒక్కరు ప్రయత్నించాలని తెలిపారు. ఉపాధ్యాయులు బడికి రాని పిల్లలని గుర్తించి తల్లిదండ్రుల ద్వారా వారిని బడికి పంపిల చూడాలని, అలాగే జిల్లాలో అక్షరాస్యత పెంచాలని సూచించారు.విద్యార్థులను సోషల్ మీడియా కి, మొబైల్ ఫోనులకి దూరంగా ఉండేలా అవగాహన కల్పించి వారికి అర్ధం అయ్యేలా పాఠాలు భోధించి వారిని జీవితంలో ఉన్నత స్థాయి కి ఎదిగేలా చూడాలని తెలిపారు.

జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు మాట్లాడుతూ….

ఉపాధ్యాయ వృత్తి గొప్పదని వారితోనే సమాజం మార్పు సాధ్యం అవుతుందని సావిత్రి బాయి పూలే అడుగుజాడల్లో నడుస్తూ విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలని అన్నారు. ఈ కార్యక్రమం లో డి ఈ ఓ అశోక్,సంక్షేమ శాఖ అధికారులు లత, అనసూర్య, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీదర్ రెడ్డి, పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి, సుపారీటిడెంట్లు పద్మారావు,శ్రీలత, సాయి గౌడ్, ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులు ,మహిళా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS