మహిళ ఉపాధ్యాయుల దినోత్సవం గా సావిత్రిబాయి పూలే జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం….
తెలంగాణ రాష్ట్ర ఎంపీల పురం రాష్ట్ర కన్వీనర్ నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి .
తొలి మహిళా ఉపాధ్యాయిని సావిత్రిబాయి ఫూలే కల్చరల్
సామాజిక విప్లవకారిణి, మనదేశపు తొలి ఉపాధ్యాయినిగా చరిత్రలో చిరస్మరణీయ స్థానం సంపారదంచుకున్న మహోన్నత మహిళ, రచయిత సావిత్రిబాయిఫూలే, మహాత్మజ్యోతిరావు పూలే భార్యగానే అందరికీ తెలుసు. కాని ఆమె మహిళా ఉద్యమ గొంతుక, చైతన్య పతాక అన్న సంగతి కొందరికే తెలుసు. మహారాష్ట్రలోని సతారా జిల్లా ఖండాలా తాలూకా నయాగావ్ గ్రామంలో 1831 జనవరి 3న రైతుదంపతులైన ఖండోజి నవ్‌సే పాటిల్, లక్ష్మీబాయి దంపతులకు సావిత్రిబాయి పూలే జన్మించారు. ఈ మహిళ గురజాడ చెప్పినట్లు చరిత్రనే తిరగరాసింది. బ్రాహ్మాణ ఆధిపత్యం కొనసాగుతున్న ఆ కాలంలో సంఘసంస్కరణకు బాటలు వేసింది. తొమ్మిదేళ్ల వయస్సులోనే పన్నెండేళ్ల మహాత్మ జ్యోతిరావును వివాహమాడారు భర్త సహకారంతో చదువుకుని, 1848 మే 12న బహుజనుల కోసం పూనేలోని బుధవార్‌పేట్‌లో మొదట పాఠశాలను ప్రారంభించారు. దేశంలోనే మొదటి ఉపాధ్యాయురాలు అయ్యారు. ఛాందసవాదులు ఆమెపై దాడులు చేసినా భయపడలేదు. నాలుగేళ్లలో 20 పాఠశాలలు ప్రారంభించి ఉచితవిద్యను ఆందించింది. అస్పృశ్యుల కోసం మంచినీళ్ల బావిని తవ్వించారు. వారి కోసం అహిల్యాశ్రమ్ అనే పాఠశాలను ప్రారంభించారు. 1849లో ఫూలే దంపతులు సంఘబహిష్కరణకు గురయినా సామాజిక కార్యక్రమాలు ఆపలేదు. సమాజ సేవ ఒక పక్క, ఉపాధ్యాయినిగా మరో పక్క కొనసాగుతూనే తనకలానికి పదను పెట్టి కవిత్వాన్ని రాశారు.
1854లో కావ్యఫూలే కవితా సంపుటిని తీసుకొచ్చారు. 1860లో వితతంతువులకు శిరోముండనం చేయవద్దని క్షురకులను చైతన్య పరిచి వారితో ఉద్యమం చేయించి విజయం సాధించారు. 1868లో అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. 1873లో సత్యశోధక సమాజాన్ని స్థాపించి బాల్య వివాహాలు, మూఢనమ్మకాల నిర్మూలన, సతీసహగమనం రూపుమాపడం, వితతంతు పునర్వివాహం కోసం శ్రమించారు. 1873 డిసెంబర్ 25న భార్యను కోల్పోయిన ఒక యువకునికి తన స్నేహితురాలి కుమార్తెతో వివాహం జరిపించారు. బ్రాహ్మణ విధవరాలి కుమారుడిని దత్తతకు తీసుకొని యశ్వంత్‌గా నామకరణం చేసి వారి ఆశలకు ఆశయాలకు అనుగుణంగా పెంచారు. 1870, 1896 సంవత్సరాలలో కరువు కబళిస్తే సుమారు 2 వేల మందికి అన్నదానం చేశారు. వారు నిర్వహించే పాఠశాలల్లో మధ్యాహ్నభోజనం పెట్టారు. 1890 నవంబర్ 28న భర్త మరణించడంతో తన భర్త చితికి తానే నిప్పంటించి సంప్రదాయాలకు చెల్లుచీటి వేశారు. 1891లో పావన కాశీసుబోధ్ రత్నాకర్ అనే మరో కావ్యాన్ని రాశారు. జ్యోతిబా భాషణే అనే నాల్గుసంపుటాలకు సంపాదకత్వం వ్యవహరించారు. 1897లో మహారాష్ట్రలో ప్లేగు వ్యాధి రావడంతో తన కుమారుడితో కలసి చికిత్సకు నడుంబిగించారు. ఈ క్రమంలోనే 1897 మార్చి 10న ప్లేగు వ్యాధితో మరణించారు. 1997లో భారత ప్రభుత్వం సావిత్రిబాయి జ్ఞాపకార్థం తపాలా స్టాంపును విడుదల చేసింది. ఇటీవల పూనే విశ్వవిద్యాలయానికి సావిత్రిబాయి పేరు పెట్టారు.
చైతన్య పతాక సావిత్రిబాయి
కళ్యాణదుర్గం స్వర్ణలత, ప్రముఖ రచయిత్రి
ఈ రోజు మన దేశంలో మహిళలు చదువుకుని అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే కారణం సావిత్రిబాయి పూలేనే. 1852లో మహిళా సేవా మండల్‌ను స్థాపించి మానవ హక్కులు సామాజిక సమస్యల గూర్చి చర్చించి, జెండర్ అసమానతలపై మహిళలలను చైతన్య పరిచారు. అంతటి మహోన్నతురాలిని స్త్రీజాతి చైతన్య పతాక అనడం సముచితమనిపిస్తుంది.
ఈతరానికి సావిత్రిబాయి పూలేను పరిచయం చేయాలి
డా.దండెబోయిన పార్వతి, తెలుగు శాఖాధ్యక్షులు, సిల్వర్‌జూబ్లీ కళాశాల
శ్రమించి పని చెయ్యండి, శ్రద్ధగా అధ్యయనం చేయండి, మంచి మార్గంలో నడవండి అన్నది సావిత్రీబాయిపూలే నినాదం. అంతటి గొప్ప నినాదాన్ని జాతికిచ్చిన సావిత్రిబాయి జీవితాన్ని ఈ తరానికి పరిచయం చేయాలి.
సమాజాన్నే మార్చిన ధీరవనిత
మహిళా మార్గదర్శి, జాతి స్థితిగతుల్నే మార్చిన మహోన్నత రచయిత్రి సావిత్రిబాయి కలలు కన్న సమాజం ఆదర్శవంతమైన సమాజం. ఏ మహిళా సమస్యలు ఎదుర్కొనకూడదని,సంఘంలో గౌరవం కోల్పోకూడదని నిరంతరం తపించారు. ఆమె ఆశయాలు ఇంకా మిగిలిపోయాయి. అవి నెరవేర్చేందుకు ప్రతి మహిళా కృషి చేయాలి. అని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు తెలిపారు