సావిత్రిబాయి పూలే జయంతి.
మహిళలకు విద్యపై ప్రప్రథమంగా నిరంతరం శ్రమించి, గళమెత్తిన ఉద్యమకారిణి, ఆదర్శ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 194వ జయంతి నేడు.
కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సావిత్రిబాయి పూలే అందరికీ స్ఫూర్తిదాయకం.
1848లోనే సావిత్రిబాయి పూలే పూణేలో దేశంలోనే తొలిసారి బాలికలకు ప్రత్యేక పాఠశాలను ప్రారంభించారు. ఆ మహానుభావురాలి స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ మహిళా సాధికారత సిద్ధాంతాన్ని అమలు పర్చుతూ మహిళా రిజర్వేషన్ల అమలుకు శ్రీకారం చుట్టింది.
కులమత భేదాలకు అతీతంగా సమసమాజ స్థాపన కోసం కృషిచేసిన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె సేవలను స్మరిస్తూ ఘననివాళి.
-వసంత వెంకట కృష్ణప్రసాదు, శాసనసభ్యులు, మైలవరం నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా.