SAKSHITHA NEWS

గుర్రంగడ్డ ప్రజల సమస్యలను సిఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా – సరితమ్మ….

  • ఆర్ఓ ప్లాంట్, బిసి కమిటీ హాల్, గ్రామాన్ని సందర్శించిన…
  • జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరితమ్మ…

గత బిఆర్ఎస్ ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం కారణంగా గుర్రంగడ్డ ప్రజలు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నరని జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ ఆవేదన వ్యక్తం చేశారు… గద్వాల మండల పరిధిలోని గుర్రంగడ్డ గ్రామాన్ని మరియు తన హయాంలో జెడ్పి నిధుల మంజూరు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్, బిసి కమిటీ హాల్ లను సందర్శించేందు బీరెల్లీ ఒడ్డున నుంచి గుర్రంగడ్డ గ్రామానికి బోటు లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రయాణం చేశారు… గ్రామంలోని నడిగడ్డ ఇలవేల్పు జమ్ములమ్మ అమ్మవారిని దర్శించుకొని,మొక్కలు నాటి గ్రామస్థులతో కలిసి పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు..గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో గుర్రంగడ్డ గ్రామానికి అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ ప్రభుత్వం లోనైన న్యాయం జరుగుతుందని ఆశతో ఎదురు చూస్తున్నట్లు గ్రామస్థులు సరితమ్మకు తెలిపారు….సరితమ్మ మాట్లాడుతూ గ్రామస్థుల సమస్యలను పరిష్కరించడానికి త్వరలోనే సిఎం రేవంత్ రెడ్డి ని కలిసి గుర్రంగడ్డ ప్రజల యొక్క ప్రధాన సమస్య అయిన బ్రిడ్జ్ పనులను పూర్తి చేయించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో నెరవేర్చడానికి కృషి చేస్తానని సరితమ్మ గ్రామస్థులకు హామీ ఇచ్చారు… అలాగే బిసి కమిటీ హాల్ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు…

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లత్తిపురం వెంకట్రామిరెడ్డి, మధుసూదన్ బాబు, శ్రీనివాస్ గౌడ్, శెట్టి ఆత్మకూరు లక్ష్మణ్, అల్వాల రాజశేఖరరెడ్డి,నాగేంద్ర యాదవ్,కుర్మన్న,జయన్న,ఈదన్న,మన్యం, శాంతన్న,జమ్మిచేడు సురేష్, వెంకటన్న,కొండపల్లి రాఘవేంద్ర రెడ్డి, కుర్మన్న, ప్రభాకర్ రెడ్డి,రాజశేఖర్,ఆనంద్,తిమోతి,అనంతపురం రాముడు,ఆంజనేయులు, ఇమ్మనేయిల్,బిల్డర్ రామకృష్ణ, రవీందర్ రెడ్డి, తిమ్మరెడ్డి,లక్ష్మణ్ గ్రామస్థులు, మహిళలు తదితరులు ఉన్నారు


SAKSHITHA NEWS