సన ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు..
సాక్షిత ప్రతినిధి కోదాడ సూర్యాపేట జిల్లా)
కోదాడ పట్టణంలోని సన ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలను ముందస్తుగా
ఘనంగా నిర్వహించారు. కనుమరుగైపోతున్న వివిధ పండుగల విశిష్టతను భారత గ్రామీణ సాంప్రదాయాలను నేటి తరం వారికి అందించాలని కళాశాలలో ఈ సంబరాలను నిర్వహించామన్నారు. సంస్కృతిక కళ ఉట్టిపడేలా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా కళాశాల వారు వారు పేర్కొన్నారు. పండుగను పురస్కరించుకొని విద్యార్థినీలకు ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోటీలో గెలుపొందిన విద్యార్థినీలకు ఎమ్మెల్యే బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు.