SAKSHITHA NEWS

ప్రజా యుద్ధనౌక గద్దర్ గురించి మాట్లాడే స్థాయి బండి సంజయ్ కి లేదు.
సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

గద్దర్ 76వ జయంతి సందర్భంగా జగద్గిరిగుట్ట చివరి బస్ స్టాప్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ మరియు ప్రజా సంఘాల నాయకులు గద్దర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఈ ఉమ్మడి రాష్ట్రంలో పేద ప్రజల కోసం అనేక పోరాటాలు నిర్వహించినటువంటి చరిత్ర, అదేవిధంగా తెలంగాణ మలిదశ, చివరి దశ ఉద్యమంలో కూడా శరీరంలో తూటాను లెక్కచేయకుండా రాష్ట్రవ్యాప్తంగా కాళ్లకు గజ్జలు కట్టుకొని, గోచి గొంగడి తో ప్రతి పల్లెలో ప్రజలకు యువకులను, విద్యార్థులను, కార్మికులను సబ్బండ వర్గాలను తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేటట్టు చేసిన గొప్ప చరిత్ర గద్దర్ కి ఉందని, అలాంటి గద్దర్ కి పద్మశ్రీ అవార్డు లాంటి అనేక అవార్డులు తన స్థాయికి సరిపోవని ప్రజలే వారికి ప్రజాయుద్ధనౌకాని పేరు పెట్టి సత్కరించుకున్నారని, గద్దర్ ని ఈ దేశ ప్రధాని అయినటువంటి మోడీ తన చనిపోయినప్పుడు సంతాపం తెలియజేసిండని, అదేవిధంగా అనేక సభలు సమావేశాలలో బిజెపి నాయకులు గద్దర్ గారిని గౌరవించుకున్నారని, అది తెలుసుకోకుండా గద్దర్ గారి పై మాట్లాడటం సమంజసం కాదని, ఇది తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారులను అవమానించడమేనని నాయకులు పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యవర్గ సభ్యులు హరినాథ్, ప్రజానాట్యమండలి అధ్యక్షులు ప్రవీణ్, డిహెచ్పిఎస్ రాష్ట్ర నాయకులు రాములు, దుర్గయ్య,వెంకటేష్, ప్రజానాట్యమండలి అధ్యక్షుడు బాబు,ఎం జె ఎఫ్ జిల్లా కార్యదర్శి యాకయ్య, లాలయ్య సార్, సోమన్న, ప్రభాకర్, సామిల్,ముసలయ్య, రవి,యాదగిరి, బాబు,జర్నలిస్టు నాయకులు తొండ వెంకట్, గణేష్, స్వామి తదితరులు పాల్గొనడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app