వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సౌత్ ఇండియా చీఫ్ కో-ఆర్డినేటర్‌గా సంగరాజు అశ్విని
సాక్షిత ప్రతినిధి – తిరుపతి:
ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ‘వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ దక్షిణ భారత దేశ చీఫ్ కో-ఆర్డినేటర్‌గా తిరుపతికి చెందిన మేక్ మై బేబి జీనియస్ స్కూల్ డైరెక్టర్ సంగరాజు అశ్విని నియమితులయ్యారు.
అశ్విని విద్యార్హతలు, ఆమెకు ఉన్న అనుభవం, నైపుణ్యాలను గుర్తించి ఈ బాధ్యతను అప్పగించినట్లు సంస్థ పేర్కొంది. తమ సంస్థ అభివృద్ధిలో ఆమె కీలక పాత్ర పోషిస్తారని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది. ఆమె ఇకపై ఇండియా చీఫ్ కో-ఆర్డినేటర్ మిస్టర్ బింగి నరేందర్ గౌడ్ పర్యవేక్షణలో విధులు నిర్వహిస్తారు.
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఇటువంటి సంస్థలో కీలక బాధ్యతలు చేపట్టడం పట్ల అశ్విని సంతోషం వ్యక్తం చేశారు. అశ్విని నియామకం పట్ల ఆమె తండ్రి ప్రముఖ హ్యాండ్ వ్రైటింగ్ నిపుణులు, ఎంఎంబీజి స్కూల్ వ్యవస్థాపకులు భాస్కర్ రాజు హర్షం వ్యక్తం చేసారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
