SAKSHITHA NEWS

రోటరీ క్లబ్ ఆఫ్ పండరిపురం మరియు రోటరీ జూబ్లీహిల్స్ హైదరాబాద్ వారి సహకారంతో కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది స్థానిక చౌదరయ్యా స్కూల్ నందు 14 మంది మహిళలకు కుట్టు మిషన్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం మహిళలు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కుటుంబానికి ఎంతో కొంత చేయూతనివ్వాలి ఇంకొకరి మీద ఆధారపడకూడదు తనవంతు సహాయంగా ఆర్థికంగా ముందుకు వెళ్లాలి అనే ఏకైక ఉద్దేశంతో..రోటరీ క్లబ్ పండిపురం వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిహెచ్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలోనే రోటరీ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టటం అభినందనీయం అన్నారు అలాగే ఈ కార్యక్రమానికి లోక్ సత్తా భాను ప్రసాద్ వెన్షన్ పాల్ రోటరీ సభ్యులు అధ్యక్షులు శరత్ కుమార్ శాస్త్రి కార్యదర్శి కోల్లా సుబ్బారావు మరియు ప్రసాద్ రాజు సుబ్రహ్మణ్యం చెంచుకున్నయ్య రాఘవయ్య అలాంగార్ మోహన్ , వసంతరావు లింగయ్య చౌదరి ప్రిన్సిపల్ భాష దాసునయన అందరూ విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది .


SAKSHITHA NEWS